: ఆదివారం సెలవు, కేసీఆర్ కేనా? సభ్యులకు వద్దా?: డీకే అరుణ
నిన్న నిర్వహించిన శాసనసభా సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదని, ఆయన సెలవు తీసుకున్నారని.. ఆయనకు ఉన్న సెలవు శాసనసభ్యులకు అక్కర్లేదా? అని కాంగ్రెస్ నేత డీకే అరుణ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం రోజున కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. సభా వ్యవహారాలు ఏదో మొక్కుబడిగా సాగుతున్నట్లు ఉన్నాయని, ప్రజా సమస్యలపై చర్చించనప్పుడు ఇటువంటి సమావేశాల వల్ల ఉపయోగం లేదని అన్నారు.