: న్యూజిలాండ్ తో ఓటమి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే...పాక్ పై గెలుపు ధైర్యమిచ్చింది: యువీ
టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలు కావడం తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ లో పదే పదే స్థానం మార్పుపై యువీ మాట్లాడుతూ, జట్టు అవసరాల ప్రకారం ఆడాల్సి ఉంటుందని అన్నాడు. పరిస్థితులను బట్టి బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. పాక్ తో మ్యాచ్ లో ఆదిలోనే వికెట్లు పడిపోవడంతో ఆందోళన చెందామని అన్నాడు. అందుకే వీలైనంత ఎక్కువ స్ట్రయిక్ రొటేట్ చేయాలని భావించామని యువీ చెప్పాడు. దురదృష్టవశాత్తు చివరివరకు తాను క్రీజులో నిలదొక్కుకోలేకపోయానని, అయితే కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మిస్తే, ధోనీ చక్కని ఫినిషింగ్ ఇచ్చాడని యువీ కితాబునిచ్చాడు. పాక్ పై విజయం ఆత్మవిశ్వాసం పెంచిందని యువీ పేర్కొన్నాడు. రానున్న మ్యాచ్ లో మరింత స్వేచ్ఛగా ఆడుతామని యువీ తెలిపాడు.