: అలిపిరి ఏవీఎస్ఓ నిజాయతీ


తనకు దొరికిన రూ.40 లక్షల విలువ చేసే నగలున్న బ్యాగ్ ను తిరిగి ఇచ్చివేసి తన నిజాయతీ నిరూపించుకున్నాడు అలిపిరి ఏవీఎస్ఓ నందీశ్వర్. తిరుమలలో జరిగిన ఒక పెళ్లికి ఎన్ఆర్ఐ భారతి కుటుంబం హాజరైంది. అక్కడి చెక్ పాయింట్ వద్ద భారతి తన బ్యాగ్ మరిచిపోయింది. ఇది గమనించిన నందీశ్వర్ ఆ బ్యాగ్ ను తమ సిబ్బందికి అప్పగించాడు. వెంటనే సదరు ఎన్ఆర్ఐ కుటుంబాన్ని సంప్రదించి, ధ్రువీకరించుకున్న తర్వాత ఆ బ్యాగ్ ను వారికి అందజేశారు. ఆ బ్యాగ్ లో నలభై లక్షల విలువ చేసే నగలున్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News