: 92 గంటలు నిర్విరామంగా టీవీ చూస్తూ ప్రపంచ రికార్డు


ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చెందిన నలుగురు యువకులు, ఓ యువతి టీవీ చూస్తూ ప్రపంచ రికార్డు సృష్టించాలని భావించారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. మార్టిజ్ ఆర్నాల్డ్స్ సమక్షంలో 92 గంటలపాటు నిర్విరామంగా టీవీ చూస్తూ గిన్నిస్ ప్రపంచ రికార్డుకెక్కారు. ప్రతి గంటకు ఓ ఐదు నిమిషాలు విరామం తీసుకునే వెసులుబాటు వీరికి కల్పించారు. ఈ ఐదు నిమిషాల్లోనే భోజనం, ఇతర పనులన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా నిబంధనల ప్రకారం నిద్ర మాని 92 గంటల పాటు టీవీ చూస్తూ వీరు ప్రపంచ రికార్డు సృష్టించారు.

  • Loading...

More Telugu News