: నేను 'గురూజీ' అని పిలుస్తా...ఆయన 'సుందీ' అని పిలుస్తారు: సహ నటుడి గురించి జాన్ అబ్రహాం


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సినీ ప్రస్థానం స్పూర్తిదాయకమని మోడల్, సినీ నటుడు జాన్ అబ్రహాం తెలిపాడు. 'యార్ మేరా సూపర్ స్టార్' అనే కార్యక్రమంలో జాన్ అబ్రహాం మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా తనను తాను నిరూపించుకుని స్టార్ గా అక్షయ్ కుమార్ ఎదిగారని చెప్పాడు. ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించానని చెప్పిన జాన్ అబ్రహాం, అక్షయ్ ను తాను 'గురూజీ' అని సంబోధిస్తానని...తనను ఆయన 'సుందీ' అని పిలుస్తారని తెలిపాడు. హాస్యాన్ని ఇష్టపడే తాను ఆయన నుంచే కామెడీ పండించడం నేర్చుకున్నానని జాన్ అబ్రహాం చెప్పాడు. ఇక, జాన్ అబ్రహాం కూడా గాడ్ ఫాదర్ లేకుండా రాణించాడని బాలీవుడ్ లో పేర్కొంటారు. కాగా, జాన్ అబ్రహాం ప్రధాన పాత్ర పోషించిన 'రాకీ హ్యాండ్సమ్' సినిమా వచ్చే వారం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News