: బీహార్ ఎమ్మెల్యేలకు కానుకలపై విమర్శల వర్షం


రాష్ట్ర బడ్జెట్ సమయంలో బీహార్ ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వడం ఆనవాయితి. గత వారం రాష్ట్ర విద్యాశాఖ 243 మంది బీహార్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కటి రూ.11 వేలు విలువ చేసే మైక్రోవేవ్ ఓవెన్లు ఇచ్చారు. ఈ వ్యవహారంపై బీహార్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ తన మంత్రివర్గంతో కలిసి చర్చలు జరుపుతున్నారు. ఈ సంప్రదాయానికి స్వస్తి పలకాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశోక్ చౌధురి మాట్లాడుతూ, ఈ కానుకల మొత్తం విలువ కేవలం రూ.30 లక్షలు మాత్రమేనని, ఈ విషయాన్ని భూతద్దంలో చూడవద్దని అన్నారు. కాగా, బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆ కానుకలను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News