: పవన్ కల్యాణ్ దగ్గర చాలా నేర్చుకున్నాను: దర్శకుడు బాబీ
పవన్ కల్యాణ్ దగ్గర తాను చాలా నేర్చుకున్నానని సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు బాబీ అన్నారు. 'పవన్ కల్యాణ్ నుంచి యుద్ధం చేయడమంటే ఏమిటో నేర్చుకున్నాను, ప్రేమించడమంటే ఏమిటో నేర్చుకున్నాను, కష్టపడి పనిచేయడమంటే ఏమిటో నేర్చుకున్నాను' అని బాబీ అన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. చిరంజీవి సినిమాలు రిలీజు అయినప్పుడు తన తండ్రి దగ్గరుండి మరీ, తనను సినిమాకు తీసుకువెళ్లేవారని చెప్పారు. గతంలో పవన్ కల్యాణ్ ని కలవడం కోసం చాలాసార్లు తాను ప్రయత్నం చేశానని గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్ గురించి మరిన్ని విషయాలు చెబుతానని బాబీ పేర్కొన్నారు.