: ఈ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కటవ్వాలి: త్రివిక్రమ్ శ్రీనివాస్
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి తనకేమీ తెలియదని ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. అభిమానుల మాదిరిగానే తాను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్స్ లోకి ఒకటి, రెండు సార్లు తాను వెళ్లానని ఆయన చెప్పారు. అయితే, దర్శకుడు బాబీతో మాట్లాడలేదని, ఎందుకంటే, ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పారు. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లన్నీ అయిపోయిన తర్వాత, రికార్డు కలెక్షన్లన్నీ లెక్కపెట్టేసుకున్న తర్వాత బాబీ, తాను మాట్లాడుకుంటామని అన్నారు. రాబోయే ప్రతి తెలుగు సినిమా మన పరిధులను మరింత ముందుకు తీసుకెళ్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటవ్వాలని, అది ఈ చిత్రంతో జరగాలని కోరుకుంటున్నానని త్రివిక్రమ్ అన్నారు.