: థియేటర్ ట్రైలర్ చూస్తే షర్టులు చించేసుకుంటారు: బ్రహ్మాజీ
‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ లుక్ చూసి తన మైండ్ బ్లో అయిందని ఈ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు బ్రహ్మాజీ అన్నారు. అయితే, థియేటర్ ట్రైలర్ రిలీజు అయితే, అభిమానులు షర్టులు చించేసుకోవాల్సిందేనని, అది అంత బాగుంటుందని బ్రహ్మాజీ అన్నారు. అంతకుముందు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. దేవీశ్రీ ప్రసాద్, తన కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు విజయవంతమయ్యాయని, అందులో 50 శాతం సక్సెస్ దేవీశ్రీకే దక్కుతుందని అన్నారు. ఈ చిత్రంలో తాను మూడు పాటలు రాశానని చెప్పారు. టైటిల్ సాంగ్, ఒక డ్యూయట్, మరో కీలక సన్నివేశానికి సంబంధించిన పాట తాను రాశానని చెప్పారు. ఇటీవల ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్స్ లో పవన్ కల్యాణ్ ను కలిశానని, తాను రాసిన పాటలకు మంచి అప్రిసియేషన్ లభించిందని రామజోగయ్యశాస్త్రి పేర్కొన్నారు.