: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు
మెదక్ జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదలైంది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు నామిషన్లు స్వీకరించనున్నారు. ఈమేరకు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 6న ఎన్నికల పోలింగ్, ఏప్రిల్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, సిద్దిపేటలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ వెల్లడించారు. పోలింగ్ కోసం 84 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.