: మర్చిపోకండి, కచ్చితంగా ప్రేమించండి: హీరో రాంచరణ్
'మర్చిపోకండి.. కచ్చితంగా ప్రేమించండి' అని ఇంజీనీరింగ్ కళాశాల విద్యార్థులతో ప్రముఖ హీరో రాంచరణ్ అన్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని సీఎమ్మార్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ, తన కాలేజీ రోజుల్లో చాలా ఎక్కువ అల్లరి చేసే వాడినని అన్నారు. 'ఫ్రెండ్స్ తో గడపాలి, ఎంజాయ్ చేయాలి, అదే సమయంలో ముఖ్యంగా కెరీర్ పై, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి' అని సూచించారు. ‘మనందరి ఫేవరెట్ టాపిక్ లవ్. మన తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ ప్రేమగీమా ఏంటి, చదువుకోమని చెప్పినా సరే, ప్రేమ నుంచి మనల్ని ఎవరూ విడగొట్టలేరు. కచ్చితంగా ప్రతిఒక్కరూ ప్రేమిస్తారు. అయితే, ఏదైనా సరే, లిమిట్ లో ఉంటే మంచిది. కాలేజీ లైఫ్ లో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. కాలేజీ రోజుల్లో నేను కూడా ప్రేమించాను. ఏ వ్యసనం, ఏ సంబంధాలు మన కెరీర్ ను, లక్ష్యాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఫ్యామిలీ, విద్య, కెరీర్, లవ్ ఇలా ప్రతిదీ కూడా జీవితంలో ఒక భాగమే అవ్వాలి. మన జీవితంలో దానికి సమయం కేటాయించాలి. మర్చిపోకండి, కచ్చితంగా ప్రేమించండి’ అని రాంచరణ్ అనడంతో విద్యార్థుల చప్పట్లతో కళాశాల ప్రాంగణం మార్మోగిపోయింది.