: తృప్తి పడొద్దు... ఇంకా మెరుగుపడాలి: ధోనీ


భారత క్రికెట్ జట్టు మరిన్ని విభాగాల్లో ఇంకా మెరుగైన ఆటతీరును ప్రదర్శించాల్సి వుందని, ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇంకాస్త బాగా ఆడాలని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. పాక్ తో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ, ఇన్నింగ్స్ మధ్యలో విరాట్ కోహ్లీ తీసిన సింగిల్స్ మ్యాచ్ గతిని భారత్ కు అనుకూలం చేశాయని, యువరాజ్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ అందుకు ఎంతో సహకరించిందని అన్నాడు. "జట్టు ప్రదర్శనతో సంతృప్తి చెందకూడదు. ఇంకా మెరుగైన ఆట ఆడాలి. నాకౌట్ దశకు మ్యాచ్ లు వెళితే, మరో చాన్స్ లభించదు. ఇప్పటి నుంచి మాకు అన్ని మ్యాచ్ లూ కీలకమే. అత్యుత్తమంగా రాణించేందుకు కృషి చేస్తాం" అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఏప్రిల్ 3న ఈడెన్ లో జరిగే ఫైనల్ పోరులో నిలిచేందుకు కృషి చేస్తామని తెలిపాడు.

  • Loading...

More Telugu News