: రూ. 149కి ఏపీలో లభించే బ్రాడ్ బ్యాండ్ వేగమిదే!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా గృహావసరాల నిమిత్తం కనెక్షన్లు ఇవ్వడం ప్రారంభమైంది. 'ఏపీ ఫైబర్ నెట్' పేరిట ఈ ప్రాజెక్టులో, నెలకు కేవలం రూ. 149తో ఇంటర్నెట్, కేబుల్, ఫోన్ సౌకర్యాలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కనెక్షన్ తీసుకున్న వారికి సెకనుకు 15 మెగాబైట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి. మరింత వేగం కావాలనుకుంటే, రూ. 999 చెల్లించి సెకనుకు 100 మెగాబైట్ల వేగంతో పనిచేసే కనెక్షన్ లభిస్తుంది. ఆఫీసులు, ఉద్యోగుల అవసరాల నిమిత్తం ఈ ఆప్షన్ జోడించినట్టు సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టీ చాంబర్స్ వివరించారు. ఖర్చును తగ్గించుకునే నిమిత్తమే అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయకుండా విద్యుత్ స్తంభాలను వినియోగించుకుని లైన్లు వేశామని వివరించారు.

  • Loading...

More Telugu News