: 'ఖుషి' తరువాత నాలుగు హిట్లు వచ్చి ఉంటే సినిమాల నుంచి తప్పుకునేవాడిని: పవన్ కల్యాణ్


ఖుషి సినిమా తరువాత వరుసగా నాలుగు మంచి హిట్లు వచ్చి ఉంటే ఇప్పుడు సినీ పరిశ్రమలో కనిపించేవాడిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక నిర్వహణపై నిర్వహించిన ప్రెస్ మీట్లో పలు అంశాలు వెల్లడించారు. అప్పుడు వచ్చిన ఫ్లాపులే ఇంతకాలం తాను సినీ పరిశ్రమలో ఉండేలా చేశాయని చెప్పారు. నటన అనేది చాలా అలసటైన విషయమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సినిమాలో ప్రతి సన్నివేశం పక్కాగా ఉండాలని భావించి బాగా ఇన్వాల్వ్ అవుతానని అన్నారు. అందుకే సినిమాల నుంచి విరామం తీసుకోవాలని భావించానని అన్నారు. అయితే ఏదీ శాశ్వతం కాదని వేదాంతం మాట్లాడారు. సినిమాల్లో నటన నుంచి విరామం తీసుకున్నప్పటికీ సినిమాలతో అనుబంధం మాత్రం కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. అది ఏ రూపంలో అన్నది మీకే తెలుస్తుందని సస్పెన్సులో పెట్టారు.

  • Loading...

More Telugu News