: కళాభవన్ మణి మృతి కేసు... సహనటులే కారణమా?
మలయాళ నటుడు కళాభవన్ మణి మృతి కేసులో పోలీసులు రహస్యాలను రాబడుతున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన శవపరీక్షలో ఇన్సెక్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు), ఇథనాల్, మిథనాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటులు జాఫర్ ఇడుక్కి, థరికిదా సాభులతో పాటు కళాభవన్‌తో సన్నిహితంగా ఉండే మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు. ఆయనపై సన్నిహితులే విష ప్రయోగానికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దర్యాప్తు వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. త్వరలోనే ఆయన మరణానికి కారణాలు తెలిసే అవకాశం ఉన్నట్లు మాత్రం పోలీసులు చెప్పారు. విలక్షణ నటుడు కళాభవన్ మణి(45) ఈనెల 6న కొచ్చిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనది అనుమానాస్పద మృతి కావడంతో దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.