: కోల్ కతాలో జోరు వాన!... దాయాదుల పోరుపై నీలి మేఘాలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నేటి రాత్రి ఐసీసీ టీ20 మెగా టోర్నీలోనే కీలక మ్యాచ్ గా పరిగణిస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మద్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్లన్నీ అమ్ముడుబోయాయి. అభిమానులంతా కోల్ కతా చేరుకున్నారు. ఇరు జట్లు కూడా ఇప్పటికే కోల్ కతా చేరుకుని మొన్న, నిన్న అక్కడ ప్రాక్టీస్ కూడా చేశాయి. అయితే ఈ మ్యాచ్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిసేపటి క్రితం కోల్ కతాలో ప్రారంభమైన వర్షం నగరాన్ని తడిపి ముద్ద చేసింది. వర్షం కారణంగా పిచ్ కూడా తడిసిపోయినట్లు సమాచారం. ఉన్నట్టుండి ఊడిపడ్డ వర్షపు జల్లులతో క్రికెట్ లవర్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వర్షంతో ఎక్కడ మ్యాచ్ రద్దవుతుందోనన్న ఆందోళన అభిమానులను పట్టి పీడిస్తోంది. వర్షం నేపథ్యంలో మ్యాచ్ రద్దైనట్లు ప్రకటనైతే రాలేదు కానీ అభిమానులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.