: ఇంటర్నేషనల్ ఏవియేషన్ షో... రేపు, ఎల్లుండి ప్రజలకు అనుమతి


హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను దర్శించేందుకు సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. ఈ షో ను దర్శించేందుకు రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రజలను అనుమతిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ నేపథ్యంలో బేగంపేట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు నార్త్ జోన్ డీసీపీ పేర్కొన్నారు. సందర్శకులు వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, హానికరమైన ఎటువంటి వస్తువులను తమ వెంట తీసుకురావద్దని డీసీపీ సూచించారు. కాగా, రెండు రోజుల క్రితం ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ ఏవియేషన్ షోలో మొత్తం 29 విభాగాల్లో విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలు అలరిస్తున్నాయి. బోయింగ్, ఎయిర్ బస్, ఎయిర్ ఇండియా, ఎంబారర్, గల్ఫ్ స్ట్రీమ్ వంటి పెద్ద కంపెనీల విమానాలు, బెల్, రష్యాకు చెందిన కంపెనీల హెలికాఫ్టర్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News