: వైద్య చికిత్స నిమిత్తం దుబాయ్ కు ముషారఫ్


వైద్య చికిత్స నిమిత్తం పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దుబాయ్ వెళ్లారు. విదేశీ పర్యటనలకు వెళ్లొదంటూ ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని పాక్ సుప్రీంకోర్టు అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన మర్నాడే ఆయన దుబాయ్ బయలుదేరి వెళ్లారు. ముషారఫ్ శుక్రవారం వేకువజామున కరాచీ ఎయిర్ పోర్టులో ‘ఎమిరేట్స్’ విమానాన్ని ఎక్కారని, ఆ విమానంలో ఎక్కిన చివరి ప్రయాణికుడు ఆయనేనని మీడియా పేర్కొంది. ‘నేను ఒక కమాండోను, నా దేశమంటే నాకు ఇష్టం. కొన్ని వారాలు లేదా నెలల్లోనే నేను తిరిగి ఇక్కడికి వస్తాను’ అని ముషారఫ్ పేర్కొన్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. కాగా, ముషారఫ్ వెన్నెముకకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే వైద్య చికిత్స నిమిత్తం ఆయన దుబాయ్ వెళ్తున్నారని ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News