: అంబేద్కర్ మాటలను ప్రస్తావించిన టీడీపీ నేత రేవంత్
‘అభివృద్ధి చెందడమంటే అద్దాలు మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి’ అని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అన్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పౌరుని జీవన ప్రమాణాలు పెరగాలని, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలను ఆదుకోవాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కొత్తవి కట్టుకుని మురిసిపోవడం అభివృద్ధి కిందకు రాదని అన్నారు. వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్ లేదని, రైతు ఆత్మహత్యల నివారణకు సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఆరోపించారు.