: చంద్రబాబు సర్కారుపై ‘కోర్టు ధిక్కరణ’ పిటిషన్... ఎమ్మెల్యేలతో భేటీలో జగన్ నిర్ణయం!


సోమవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో రెండు కీలక పిటిషన్లు విచారణకు రానున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విచారణ సోమవారం జరగనుంది. తాజాగా సోమవారం హైకోర్టుకు మరో ‘పొలిటికల్’ ఫిర్యాదు అందనుంది. రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అసెంబ్లీ స్పీకర్ తో పాటు చంద్రబాబు సర్కారు అమలు చేయలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కారుపై ‘కోర్టు ధిక్కరణ’ కింద పిటిషన్ దాఖలు చేయాలని ఆయన దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న జగన్... తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో భాగంగానే చంద్రబాబు సర్కారుపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేయాలని ఆయన నిర్ణయించారు.

  • Loading...

More Telugu News