: ఉత్తరాదికి పాకిన ‘జంపింగ్’!... ఉత్తరాఖండ్ లో సీన్ రివర్స్!


తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో జోరుగా సాగుతున్న ‘జంపింగ్’ సంస్కృతి ఉత్తరాదికీ పాకింది. అయితే ఇక్కడ అధికార పార్టీలు విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు వల వేస్తోంటే... అక్కడ మాత్రం అధికార పక్ష సభ్యులకు లంగరేస్తున్న విపక్షం ఏకంగా ప్రభుత్వాన్నే కుప్పకూల్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ అరుదైన ఘటన చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో హరీశ్ రావత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. నేటి ఉదయం బీజేపీ సంచలన ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ఆ 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ‘చేయి’స్తే హరీశ్ రావత్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో ఉత్తరాఖండ్ వ్యవహారం ఒక్కసారిగా జాతీయ మీడియాలో హాట్ టాపిక్ లా మారింది.

  • Loading...

More Telugu News