: 25 వేల మంది స్నేహితులుంటేనే ఛాన్సిస్తాం: అమిత్ షా
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ టికెట్ పొందాలని ఆశిస్తున్న ఆశావహులకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఝలకిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలుండాలని, ఫేస్ బుక్ లో కనీసం 25 వేల మంది స్నేహితులు ఉంటేనే వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేయడంతో, బరిలోకి దిగాలని భావిస్తున్న వారు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. సోషల్ మీడియాలో పేరున్న నేతలకే టికెట్లివ్వాలని బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ నేతల్లో అత్యధికులు సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా లేరు. ఇక ఇప్పుడు పలువురు ఆగమేఘాల మీద ఖాతాలు ఓపెన్ చేస్తూ, ఎక్కువ మందిని స్నేహితులుగా చేర్చుకునేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.