: కొలువులపై తీపి కబురందేనా?... నేడే ఏపీ కేబినెట్ కీలక భేటీ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ నేడు భేటీ కానుంది. హైదరాబాదులోని సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో ఉద్యోగాల భర్తీపై ప్రధాన చర్చ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఓ వైపు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాగా, ఏపీలో మాత్రం ఇప్పటిదాకా ఆ దిశగా అడుగు పడలేదు. మరోవైపు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, నోటిఫికేషన్లు జారీ చేయడానికి తాము సర్వం సిద్ధంగా ఉన్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంపైనే కేబినెబ్ ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.