: సాంకేతిక విప్లవంతో ఈ పదిమంది కుబేరులయ్యారు!


సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని కొత్తపుంతలు తొక్కించిన సంగతి విదితమే. సాంకేతిక విప్లవం కారణంగా పలువురు వ్యక్తులు కుబేరులుగా అవతరించారు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కుబేరులుగా అవతరించిన టాప్ టెన్ వ్యక్తులు వీరే. 1) బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (అమెరికన్, సంపద 75 బిలియన్ డాలర్లు) 2) జెఫ్ బెజోస్, అమెజాన్ స్థాపకుడు, సీఈవో (అమెరికన్, సంపద 45.2 బిలియన్ డాలర్లు) 3) మార్క్ జూకర్ బర్గ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు (అమెరికన్, సంపద 45.6 బిలియన్ డాలర్లు) 4) లారీ ఎలిసన్, ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు (అమెరికన్, సంపద 43.6 బిలియన్ డాలర్లు) 5) లారీ పేజ్, గూగుల్ వ్యవస్థాపకుడు, ఆల్పాబెట్ సీఈవో, (అమెరికన్, సంపద 35.2డాలర్లు) 6) సెర్జీ బ్రీన్, అల్పాబెట్ అధ్యక్షుడు (అమెరికన్, సంపద 34.4 బిలియన్ డాలర్లు) 7) స్టీవ్ బామర్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో (అమెరికన్, సంపద 23.5 బిలియన్ డాలర్లు) 8) జాక్ మా, అలీబాబా వ్యవస్థాపకుడు (చైనీస్, సంపద 20.5 బిలియన్ డాలర్లు) 9) మైఖెల్ డెల్, డెల్ కంపెనీ బోర్డు చైర్మన్ (అమెరికన్, సంపద 19.8 బిలియన్ డాలర్లు) 10) మా హువాతెంగ్, టెన్సెంట్ హోల్డింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు (చైనీస్, సంపద 16.6 బిలియన్ డాలర్లు)

  • Loading...

More Telugu News