: మెగాస్టార్ తనయ శ్రీ‌జ వివాహ వేదిక‌పై స్ప‌ష్ట‌త...బెంగళూరులో వివాహ వేడుక!


టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక ఎక్క‌డంటూ కొన‌సాగుతోన్న‌ అభిమానుల చ‌ర్చ‌కు తెర‌ప‌డింది. శ్రీ‌జ పెళ్లి వేదిక‌పై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఆమె పెళ్లి బెంగళూరులో నిర్వ‌హించ‌నున్నారు. అక్క‌డి మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ లో శ్రీ‌జ మెడ‌లో మూడుముళ్లు ప‌డ‌బోతున్నాయి. ఇక‌ రిసెప్షన్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఏర్పాటు చేశారు. మార్చి 31న ఇక్క‌డ గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ నేప‌థ్యంలో ఆహ్వాన పత్రికలు సిద్ధమ‌య్యాయి. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కల్యాణ్ తో ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఈ నెల 28న వివాహం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజ‌ర‌వుతున్న‌ట్లు స‌మాచారం. అయితే, హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేయ‌నున్న‌ వివాహ విందుకు ప‌లు రంగాల‌కు చెందిన‌ ముఖ్యమైన వారిని ఆహ్వానించి, గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News