: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు


భారత్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఫ్లాట్ గా ముగిశాయి. దీంతో సెన్సెక్స్‌ 5 పాయింట్లు నష్టపోయి 24,677 పాయింట్లకు చేరుకోగా; నిఫ్టీ స్వల్పంగా లాభపడడం విశేషం. 13 పాయింట్లు లాభపడి 7,512 పాయింట్లకు నిఫ్టీ చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో బీపీసీఎల్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 5.69శాతం లాభపడి రూ.865 వద్ద ముగిశాయి. లుపిన్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 4.64శాతం నష్టపోయి రూ.1,668.95 వద్ద ముగిశాయి. ఇక‌, డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి రూ.66.58 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News