: గేల్ ఏం చేయగలడో అదే చేశాడు...మా బౌలర్లు చేష్టలుడిగారు: మోర్గాన్


వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ ఏం చేయగలడో అదే చేశాడని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. తొలి మ్యాచ్ లో విండీస్ పై ఓటమిపై మోర్గాన్ మాట్లాడుతూ, గేల్ ను కట్టడి చేసేందుకు షార్ట్ పిచ్ బంతులు వేయాలని వ్యూహం రచించుకున్నామని అన్నాడు. వాటిని గేల్ అద్భుతంగా ఎదుర్కొన్నాడని తెలిపాడు. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగలిగామని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఆదిల్ రషీద్ బౌలింగ్ లో గేల్ రెచ్చిపోయాడని చెప్పాడు. తమ బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా గేల్ విరుచుకుపడ్డాడని ఆయన పేర్కొన్నాడు. అలాంటి బ్యాట్స్ మన్ కు బంతులేయడం కష్టమని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లో సెంచరీ చేసిన గేల్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News