: గేల్, బ్రావోలతో పార్టీ చేసుకున్న స్నేహ ఉల్లాల్


వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ పార్టీ ప్రియుడన్న సంగతి తెలిసిందే. పార్టీలను అమితంగా ఇష్టపడే గేల్ బీచ్ ఒడ్డున కట్టుకున్న ఇంట్లో బెడ్రూంలో స్ట్రిప్ పోల్ డ్యాన్స్ పార్టీ డయాస్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే గేల్ పార్టీలు నిర్వహిస్తాడు. ఆ ఫోటోలను కూడా ఇతర క్రికెటర్లతో పంచుకుని, నాలా జీవించగలరా? అంటూ సవాళ్లు విసురుతుంటాడు. ఇక, గత రాత్రి జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై అద్భుతమైన సెంచరీ చేసిన గేల్ విజయానందంతో పార్టీ చేసుకున్నాడు. గేల్, బ్రావో చేసుకున్న ఈ పార్టీలో చాలా కాలంగా వెండితెరపై అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటున్న స్నేహఉల్లాల్ సందడి చేసింది. ఈ పార్టీ సందర్భంగా గేల్, బ్రావోతో దిగిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, సినీ అభిమానుల మెదళ్లకు మేతపెట్టింది. ఈ పార్టీలో బ్రావో ఛాంపియన్ పాటను కూడా ఆవిష్కరించాడని స్నేహ ఉల్లాల్ తెలిపింది.

  • Loading...

More Telugu News