: నా బర్త్ డేకి బహుమతులు తీసుకురావద్దు: మోహన్ బాబు


తన పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యే వారు బహుమతులను తీసుకురావద్దని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు అన్నారు. ఇలా బహుమతులకు వృథా ఖర్చు చేయవద్దని, ఈ నెల 19న బర్త్ డే జరుపుకోనున్న డైలాగ్ కింగ్ కోరారు. అయితే, ఇందుకు బదులుగా 'మిరాకిల్' అనే స్వచ్ఛంద సంస్థకు అందుకు తగ్గా నగదును విరాళంగా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఈ సంస్థను తాను సందర్శించానని, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని మోహన్ బాబు చెప్పారు. కాగా, ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకలను తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో ఆయన జరుపుకుంటారు.

  • Loading...

More Telugu News