: బుల్లి యువరాజు పచ్చగా పదికాలాలు వర్ధిల్లాలని... లక్షా ఎనిమిది వేల మొక్కలు నాటారు!


భారతదేశ సరిహద్దుల్లో ఉన్న బుల్లి దేశం భూటాన్ యువరాజు వాంగ్ చుక్, రాణి జత్సున్ పెమా దంపతులకు వారసుడు జన్మించిన సంగతి తెలిసిందే. రాజకుటుంబాల్లో వారసులు జన్మిస్తే ఆ దేశ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకునేందుకు వివిధ రూపాల్లో వేడుకలు నిర్వహిస్తారు. భూటాన్ ప్రజలు మాత్రం బుల్లి యువరాజు ఆగమనాన్ని పురస్కరించుకుని, అక్కడున్న పర్వత సానువుల్లో సుమారు లక్షా ఎనిమిది వేల మొక్కలు నాటి యువరాజు కలకాలం పచ్చగా వర్ధిల్లాలని కోరుకున్నారు. సుమారు 60 శాతానికిపైగా అటవీ ప్రాంతం కలిగిన భూటాన్ లో ఒకేసారి ఇన్నిమొక్కలు నాటడం విశేషమే. కాగా, గతంలో కేవలం గంటలో 5000 మొక్కలు నాటిన రికార్డు భూటాన్ పేరిటే ఉంది. పర్యావరణంపై అవగాహనతో మంచి కార్యక్రమం చేపట్టిన భూటాన్ ప్రజలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News