: చార్మినార్ ప్రాంతంలో బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెడతాం: మంత్రి కేటీఆర్


హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతంలో పాదచారుల కోసం ఫుట్ పాత్ ప్రాజెక్టును ఐదు నెలల్లో పూర్తి చేస్తామని, ఆ ప్రాంతంలో త్వరలో బ్యాటరీతో నడిచే వాహనాలు, బస్సులను ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయమై ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్, ముంతాజ్ ఖాన్, పాషాఖాద్రి ప్రశ్నించారు. ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ, చార్మినార్ ఫుట్ పాత్ ప్రాజెక్టుకు 1993లో రూపకల్పన జరిగిందని, పనులు ప్రారంభించింది మాత్రం 2007లోనే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనుల్లో చాలా ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. చార్మినార్ వద్ద తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News