: యాదాద్రిలో కేసీఆర్ దంపతులు!... లక్ష్మీనరసింహుడికి ముత్యాల తలంబ్రాల సమర్పణ


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా కొద్దిసేపటి క్రితం యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి యాదగిరి గుట్ట చేరుకున్న కేసీఆర్ దంపతులు యాదగిరీశుడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరం యాదాద్రి అభివృద్ధికి సంబంధించి కేసీఆర్ అక్కడే అధికారులతో సమీక్షించారు.

  • Loading...

More Telugu News