: మోదీ ఇంటర్నెట్ స్టార్: టైమ్స్ మ్యాగజైన్


ఇంటర్నెట్ లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో మోదీ వరుసగా రెండో ఏడాది ఈ స్థానం దక్కించుకున్నారు. ‘టైమ్స్’ విడుదల చేసిన జాబితాలో మోదీ ‘ఇంటర్నెట్ స్టార్’ అంటూ పేర్కొంది. ఇంటర్నెట్ కు సంబంధించి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. అయితే, ర్యాంకులు మాత్రం ఇవ్వలేదు. ఆ జాబితాలో నరేంద్ర మోదీతో పాటు, అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, రచయిత్రి జేకే రౌలింగ్ తదితరులు ఉన్నారు. కాగా, నరేంద్ర మోదీకి ట్విట్టర్ లో 18 మిలియన్ల మంది, ఫేస్ బుక్ లో 32 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని ‘టైమ్స్’ పేర్కొంది.

  • Loading...

More Telugu News