: రోజాను అసెంబ్లీకి రానివ్వం!... మహిళా మార్షల్స్ ను రంగంలోకి దించామన్న బొండా


వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీసుకున్న సంచలన నిర్ణయం నేపథ్యంలో టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సందర్భంగా బొండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ అయిన రోజాను కాల పరిమితి ముగియకుండా సభలో అడుగుపెట్టనివ్వబోమని ఆయన చెప్పారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చేందుకు రోజా యత్నిస్తే, ఆమెను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్ ను రంగంలోకి దించామని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News