: శ్రీవారి సేవలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి... ‘మంచు’ కుటుంబం కూడా!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని నేటి ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిన్న రాత్రికే తిరుమల చేరుకున్న షాలిని నేటి ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన మంచు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు, ఇద్దరు మనవరాళ్లతో కలిసి వెంకన్నను దర్శించుకున్నారు. వెంకన్న దర్శనానికి వచ్చిన షాలిని, మోహన్ బాబులకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.