: హైకోర్టు విడిపోతే జగన్ తప్పించుకుంటాడన్న భయంలో చంద్రబాబు: టీఆర్ఎస్ ఎంపీ వినోద్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించకుండా మోదీతో స్నేహంగా ఉన్న చంద్రబాబు అడ్డు పడుతున్నాడని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. తాము ఎన్నిసార్లు న్యాయశాఖకు విన్నవించినా, కుంటి సాకులు చెబుతున్న కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. హైకోర్టు విభజన జరిగితే, ఏపీలో విపక్షనేత జగన్ పై విచారణ దశలో ఉన్న కేసులన్నీ ఏళ్ల తరబడి జాప్యం కావచ్చని, దీంతో జగన్ బయటపడిపోతారని చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజన జరగకుంటే, ఏపీ న్యాయమూర్తులతో తెలంగాణ వారికి అన్యాయమే జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.