: సోషల్ మీడియాలో విజయ్ మాల్యా పాత ఇంటర్వ్యూ!... వైరల్ గా మారిన వీడియో


మొత్తం 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గుట్టు చప్పుడు కాకుండా లండన్ చెక్కేశారు. మాల్యా పలాయనంపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో లెక్కలేనన్ని వార్తా కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ క్రమంలో 1998లో ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సదరు ఇంటర్వ్యూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ ఇంటర్వ్యూలో మాల్యా... భారత్ లోని తన శత్రువులు, ప్రేమ వ్యవహారాలతో పాటు ప్రస్తుతం అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతున్న డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News