: వేల్ఫేర్ గ్రూప్ సంస్థలపై దేశవ్యాప్తంగా దాడులు


దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వెల్ఫేర్ గ్రూపు సంస్థలకు చెందిన కార్యాలయాలపై బుధవారం సీబీఐ ఆకస్మిక సోదాలకు దిగింది. అలాగే వెల్ఫేర్ గ్రూపు యజమాని, విశాఖ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ కు చెందిన విశాఖలోని ఆయన నివాసంలోనూ సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయ ప్రసాద్ నివాసం నుంచి రూ. 45 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వెల్ఫేర్ గ్రూపు దేశవ్యాప్తంగా ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ చిట్ ఫండ్ పేరుతో డిపాజిట్లు వసూలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. అధిక వడ్డీ ఆశచూపి ఆ నిధులను మళ్లించడం ద్వారా మోసం చేశారంటూ బాధితులు జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించడంతో... విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ వెల్ఫేర్ సంస్థలపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా వెల్ఫేర్ గ్రూపు సంస్థల కార్యాలయాల్లో సోదాలకు దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు గుడివాడ వెల్ఫేర్ సంస్థ కార్యాలయంపై డిపాజిట్ దారులు దాడికి దిగారు. ఆరు నెలలుగా తమ డిపాజిట్లు చెల్లించకుండా తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ ను ధ్వసం చేశారు.

  • Loading...

More Telugu News