: విమానయాన రంగంలో 2020 నాటికి భారత్ మూడో స్థానంలో ఉంటుంది: రాష్ట్రపతి ప్రణబ్


పౌరవిమానయాన రంగంలో 2020 నాటికి ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంటుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఏవియేషన్ షో ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్ అని అన్నారు. 25 దేశాల మంత్రులు, రాయబారులు, ఉన్నతాధికారులతో పాటు, 12 దేశాలకు చెందిన 200 కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని అన్నారు. వైమానిక ప్రదర్శనకు చొరవ తీసుకున్న కేంద్రం తీరు ప్రశంసనీయమని ప్రణబ్ అన్నారు. కాగా, ఈ ఏవియేషన్ షోలో మొత్తం 29 విభాగాల్లో విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలు 5 రోజుల పాటు అలరించనున్నాయి బోయింగ్, ఎయిర్ బస్, ఎయిర్ ఇండియా, ఎంబారర్, గల్ఫ్ స్ట్రీమ్ వంటి పెద్ద కంపెనీల విమానాలతో పాటు అగస్టా వెస్ట్ లాండ్, బెల్, రష్యాకు చెందిన కంపెనీల హెలికాఫ్టర్లను ఇక్కడ ప్రదర్శించనున్నారు.

  • Loading...

More Telugu News