: మ్యూజిక్ ఛానెల్ యాంకర్ నిరోషా ఆత్మహత్య
ఒక మ్యూజిక్ ఛానెల్ కు చెందిన యాంకర్ నిరోషా ఆత్మహత్యకు పాల్పడింది. సికింద్రాబాద్ సింధి కాలనీలోని ప్రైవేటు హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నిరోషా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.