: అటు ఏపీ, ఇటు తెలంగాణ... కేంద్రంపై ముప్పేట దాడి!


కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజించిన కీలక చర్య... ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మెడకు చుట్టుకుంది. ఆర్థిక లోటులో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ప్రకటించాలని ఏపీకి చెందిన మిత్రపక్ష, విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఏపీ సభ్యుల వాదనను భుజాన వేసుకున్న కాంగ్రెస్ పార్టీ అటు లోక్ సభతో పాటు ఇటు రాజ్యసభలోనూ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఆ పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు కూడా బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పేలోగానే లోక్ సభలో తెలంగాణ తరఫున టీఆర్ఎస్ సభ్యులు కూడా మోదీ సర్కారుపై దాడికి దిగారు. విభజన చట్టంలో ప్రకటించిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాక అన్నీ ఏపీకే కేటాయిస్తున్న కేంద్రం, తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిస్తోందని విరుచుకుపడ్దారు. జితేందర్ రెడ్డికి మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆ పార్టీ సభ్యులు కేంద్రం వైఖరికి నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News