: ‘భారత్ మాతా కీ జై’ ఉచ్చారణ ఐచ్ఛికమే!... ఓవైసీకి కేంద్ర మాజీ మంత్రి మద్దతు!


పీకపై కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’ అన్న పదాన్ని పలకబోనని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలకు రియాక్షన్లు ఒక్కటొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే శివసేన పార్టీ ఓవైసీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయగా... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాత్రం ఓవైసీకి మద్దతు పలికారు. ‘భారత్ మాతా కీ జై’ ఉచ్చారణ ఐచ్ఛికమేనని సల్మాన్ వ్యాఖ్యానించారు. ‘భారత్ మాతా కీ జై’ ఉచ్చారణను ఏ ఒక్కరిపైనా బలవంతంగా రుద్దలేమని కూడా ఆయన నేటి ఉదయం ఢిల్లీలో అన్నారు. ‘‘జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సందర్భంగా గర్వంగా ఫీలవుతాం. జాతీయ పతాకాన్ని చూసినా, వందేమాతరం విన్నా అలాంటి అనుభూతే కలుగుగుంది. అయితే కొందరు అలా ఫీలవరు. అది వారి ఇష్టం’’ అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News