: కౌరవుల సభలో మాకెలా న్యాయం జరుగుతుంది?: జగన్ ఘాటు వ్యాఖ్య


ఏపీ అసెంబ్లీపై సభలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న రాత్రి ఘాటు వ్యాఖ్య చేశారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను మరునాటికి వాయిదా వేశారు. ఆ తర్వాత సభ నుంచి బయటకు వచ్చిన జగన్... అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీని కౌరవ సభగా అభివర్ణించిన ఆయన, కౌరవ సభలో తమకు న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే మంగళవారం (నేడు) స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News