: ‘భారత్ మాతా కీ జై’ అనకపోతే... పాకిస్థాన్ వెళ్లిపో!: ఓవైసీకి శివసేన అల్టిమేటం


‘పీకపై కత్తి పెట్టినా... భారత్ మాతా కీ జై అనను’ అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపనున్నాయి. జేఎన్ యూ వివాదం నేపథ్యంలో భావి తరాలకు ‘భారత్ మాతా కీ జై’ అన్న నినాదాన్ని నేర్పాల్సి ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్స్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఓవైసీ... ఇటీవల మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభ వేదికపై నిరసన గళం వినిపించారు. తన పీకపై కత్తి పెట్టినా, ‘భారత్ మాతా కీ జై’ అన్న మాట తన నోట నుంచి రాదని ఓవైసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతవారంలో జరిగిన ఈ సభలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నిన్న మీడియాలో ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పార్టీ శివసేన ఘాటుగా స్పందించింది. ‘భారత్ మాతా కీ జై’ అని ఉచ్చరించకపోతే... తక్షణమే ఓవైసీ పాకిస్థాన్ వెళ్లిపోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాందాస్ కదమ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News