: జగన్ దయవల్ల అందరూ జైలుకు వెళ్తారు: మంత్రి యనమల


న్యాయవ్యవస్థపై, జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయవల్ల అందరూ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అన్ని వ్యవస్థలపై, కోర్టు తీర్పులపై, జడ్జిలపై జగన్ ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను జగన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన జగన్ కు సభలో ఉండే అర్హత లేదని అన్నారు. ఎంత పెద్ద వారైనా నోరుజారినప్పుడు క్షమాపణలు చెప్పడం పరిపాటని.. ఆ విషయాన్ని ప్రతిపక్షనేత జగన్ అర్థం చేసుకోవాలని యనమల కోరారు.

  • Loading...

More Telugu News