: జగన్.. నువ్వు మగాడివైతే.. నా ఛాలెంజ్ స్వీకరించు : సవాల్ విసిరిన అచ్చెన్నాయుడు
‘జగన్.. దమ్ము, ధైర్యం ఉంటే.. నువ్వు మగాడివైతే చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలి’ అంటూ ప్రతిపక్ష నేతపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశారు. జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, లేనిపోని ఆరోపణలు చేయడం జగన్ కు అలవాటైపోయిందని అన్నారు. సోలార్ అగ్రిమెంట్ లో ఇంతవరకూ టెండర్లే పిలవలేదు.. అప్పుడే కుంభకోణం జరిగిందని.. ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతారంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ఆరోపణలను నిరూపించుకోవాలని, తాను చేసిన ఛాలెంజ్ ని దమ్ముంటే జగన్ స్వీకరించాలని అచ్చెన్నాయుడు అన్నారు.