: 15 రోజుల సమాధి అనంతరం పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డ బీహార్ ప్రమోద్ బాబా... భక్తుల నీరాజనాలు!


స్వయం ప్రకటిత బాబాగా బీహార్ లోని మాధేపురా జిల్లాలో భారీ శిష్యగణాన్ని కలిగివున్న ప్రమోద్ బాబా, 15 అడుగుల లోతైన సమాధిలో 15 రోజుల పాటు గడిపి పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చారు. ఫిబ్రవరి 28న ఆయన సమాధిలోకి వెళ్లాడని, తిరిగి బయటకు వస్తానని ముందే చెప్పారని, దైవాంశ సంభూతుడైన ఆయన తిరిగి చెప్పినట్టే క్షేమంగా వచ్చారని భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతుతో తవ్విన గోతిలో... ఒక పరుపుపై బాబా కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్లగా, ఆపై ఒక వస్త్రాన్ని కప్పి, దానిపై మట్టితో కప్పేసినట్టు భక్తులు చెబుతున్నారు. అయితే, సమాధి తొలి రోజున విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లినప్పటికీ, బాబా సాధనకు అడ్డుపడవద్దంటూ భక్తులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. కాగా, సమాధి నుంచి బయటపడిన అనంతరం ఆయన్ను పరీక్షించిన డాక్టర్లు, బాబా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News