: 13 జిల్లాల ‘మట్టి, నీరు’తో హస్తిన చేరిన రఘువీరా... నేడు రాష్ట్రపతితో భేటీ


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చేపట్టిన మట్టి సత్యాగ్రహం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన మట్టి, నీరు మూటలతో మూడు రోజుల క్రితం బయలుదేరిన రఘువీరా నిన్న రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరకముందే మూడు రోజుల పాటు అక్కడ చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్న రఘువీరా... నేటి మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఎన్సీపీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ తోనూ రఘువీరా సమావేశమవుతారు. ఆందోళనల్లో భాగంగా ఆయన పార్టీ నేతలతో కలిసి రాజ్ ఘాట్ వద్ద మట్టి సత్యాగ్రహం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News