: వంట చేయడమంటే ఇష్టం: హీరో నారా రోహిత్
వంట చేయడమంటే తనకు ఇష్టమని, తనకు సమయం దొరికినప్పుడు కుకింగ్ చేస్తానని ప్రముఖ యువ నటుడు నారా రోహిత్ అన్నాడు. వంట చేయడం, క్రికెట్ ఆడటం తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని చెప్పాడు. షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు, వీలైతే కనుక లొకేషన్ లో కుకింగ్ చేస్తుంటానని, తోటి ఆర్టిస్టులందరితో కలిసి తింటానని చెప్పాడు. బహుశ వచ్చే ఏడాదిలో తన వివాహం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తాజాగా విడుదలైన తన ‘తుంటరి’ చిత్రం మంచి ఎంటర్ టెయినర్ అని చెప్పాడు.