: విజయ్ మాల్యాపై హైదరాబాదు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ


మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జీఎంఆర్ గ్రూప్ హైదరాబాద్ విమానాశ్రయానికి సంబంధించి మాల్యా ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు... మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు సంబంధించి సుమారు రూ.8 కోట్ల బకాయిలు జీఎంఆర్ కు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.50 లక్షలకు సంబంధించి ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టు అధికారులు ఫిర్యాదు చేయడంతో మాల్యా, కింగ్ ఫిషర్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) ఎ. రఘునాథ్ పై చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 10వ తేదీన హైదరాబాదులోని స్థానిక కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ విచారణకు వారు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాల్యాను ఏప్రిల్ 13న కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా, బ్యాంక్ కు వేల కోట్ల రూపాయలు బకాయిపడ్డ మాల్యా ప్రస్తుతం యూకే లో తలదాచుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News